అంతర్జాతీయ క్లైమెట్ టెక్నాలజీ పెట్టుబడుల్లో తొమ్మిదో స్థానంలో భారత్!
దిశ, వెబ్‌డెస్క్: గత ఐదేళ్లలో క్లైమెట్ టెక్నాలజీ పెట్టుబడులకు సంబంధించి టాప్-10 దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారతీయ టెక్ సంస్థలు 2016-2021 మధ్య 1 బిలియన్ డాలర్లు(రూ. 7,500 కోట్లు) వెంచర్ కేపిటల్ నిధులను అందుకున్నాయని ఓ నివేదిక తెలిపింది. డాటాబేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీల్‌రూమ్ అండ్ కో రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కలిమెట్ టెక్ కంపెనీల్లో వెంచర్ కేపిటల్ పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని, 2016 నుంచి 2022 మధ్య అత్యధికంగా […]
దిశ, వెబ్‌డెస్క్: గత ఐదేళ్లలో క్లైమెట్ టెక్నాలజీ పెట్టుబడులకు సంబంధించి టాప్-10 దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారతీయ టెక్ సంస్థలు 2016-2021 మధ్య 1 బిలియన్ డాలర్లు(రూ. 7,500 కోట్లు) వెంచర్ కేపిటల్ నిధులను అందుకున్నాయని ఓ నివేదిక తెలిపింది. డాటాబేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీల్‌రూమ్ అండ్ కో రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కలిమెట్ టెక్ కంపెనీల్లో వెంచర్ కేపిటల్ పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని, 2016 నుంచి 2022 మధ్య అత్యధికంగా అమెరికా 48 బిలియన్ డాలర్ల(రూ. 3.6 లక్షల కోట్ల)తో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో చైనా 18.6 బిలియన్ డాలర్ల(రూ. 1.3 లక్షల కోట్ల)తో కొనసాగుతోంది.
ఆ తర్వాత స్వీడన్ 5.8 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలోనూ, యూకే 4.3 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది. 3.7 బిలియన్ డాలర్లతో ఫ్రాన్స్ ఐదో స్థానంలో ఉంది. భారత్ 1 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కలిసి పనిచేయాలి. దీనిద్వారా జీరో కార్బన్ ఉద్గారాలను కట్టుబడి ఉండగలమని లండన్ అండ్ పార్టనర్స్ వ్యాపార వృద్ధి భారత విభాగానికి చెందిన హేమిన్ భరుచా అన్నారు. గ్లోబల్ క్లైమెట్ టెక్ వెంచర్ కేపిటల్ పెట్టుబడులు 2016 నుంచి 2020 నాటికి ఐదు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.