భారత్‌లో మెరుగైన రికవరీ రేటు

న్యూఢిల్లీ: మెరుగైన రికవరీ రేట్లున్న ప్రపంచదేశాల సరసన ప్రస్తుతం భారత్ ఉన్నదని, అందుకు కారణం దేశంలోని పటిష్ట ఆరోగ్య వ్యవస్థనే కారణమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అంతేకాదు, కరోనాపై పోరులో సుమారు 150దేశాలకు సహకరించగలిగామని శుక్రవారం ఐక్యరాజ్యసమితి హైలెవెల్ సెగ్మెంట్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీవోఎస్‌వోసీ) సమావేశంలో వెల్లడించారు. భద్రతా మండలిలో స్థానం లభించిన తర్వాత మోడీ తొలిసారిగా యూఎన్ వేదికమీద వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం చివరి సెషన్‌లో నార్వే ప్రధాని, సంస్థ […]

Update: 2020-07-17 11:34 GMT

న్యూఢిల్లీ: మెరుగైన రికవరీ రేట్లున్న ప్రపంచదేశాల సరసన ప్రస్తుతం భారత్ ఉన్నదని, అందుకు కారణం దేశంలోని పటిష్ట ఆరోగ్య వ్యవస్థనే కారణమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అంతేకాదు, కరోనాపై పోరులో సుమారు 150దేశాలకు సహకరించగలిగామని శుక్రవారం ఐక్యరాజ్యసమితి హైలెవెల్ సెగ్మెంట్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీవోఎస్‌వోసీ) సమావేశంలో వెల్లడించారు. భద్రతా మండలిలో స్థానం లభించిన తర్వాత మోడీ తొలిసారిగా యూఎన్ వేదికమీద వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం చివరి సెషన్‌లో నార్వే ప్రధాని, సంస్థ కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ సహా ప్రధాని మోడీ ప్రసంగించారు.

ఈ ప్రసంగంలో భారత ఆరోగ్య వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, ఐక్యరాజ్య సమతిలో చేయాల్సిన సంస్కరణలు ఎత్తిచూపారు. భారత్‌లో 2025కల్లా టీబీ లేకుండా చేస్తామని అన్నారు. భూకంపాలు, తుఫాన్లు, వైరస్‌లు, ప్రకృతివైపరిత్యాలు, లేదా మానవప్రేరిత ఉపద్రవాలైనా భారత ఆరోగ్య వ్యవస్థ తన సత్తా చాటుకుంటూ వస్తున్నదని తెలిపారు. అందరిని కలుపుకుపోతూ అందరి విశ్వాసం చూరగొని వారి అభివృద్ధికి పాటుపడటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో కరోనాపోరును ఒక ప్రజాఉద్యమంగా మలిచామని, ఈ పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ప్రజలనూ భాగస్వాములను చేశామని తెలిపారు. ప్రపంచంలోని ఆరింట ఒకవంతు జనాభా ఇండియాలోనే ఉన్నదని, వారందరి యోగక్షేమాల బాధ్యతపై ఎప్పుడూ జాగరూకతగానే ఉంటామని వివరించారు. ఇక్కడ అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తే, ప్రపంచమంతా వృద్ధి బాటలో కీలక ముందడుగు వేసినట్టే అవుతుందని చెప్పారు.

యూఎన్ పునర్జన్మించాలి..
రెండో ప్రపంచ యుద్ధ కాలం తర్వాత ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిందని మోడీ గుర్తుచేశారు. ఇప్పుడు అటువంటి ఉపద్రవమే కరోనా రూపంలో ఎదురైన సందర్భంలో ఐరాస మళ్లీ కొత్త జన్మతీసుకోవాలని, సంస్థలో సంస్కరణలు జరపాల్సిన అవసరమున్నదని సూచించారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టుగా సంస్థను మలుచుకోవాలని, అందుకు కరోనా అందించిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని తెలిపారు. ఇప్పుడు అవసరమైన బహుళపక్ష ప్రయోజనాలకు అనుగుణంగా సంస్థ సేవలందించాలని, ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే వ్యూహాన్ని అనుసరించాలని అన్నారు.

ప్రపంచ శాంతి సామరస్యత, సామాజిక-ఆర్థిక సమానత్వానికి భారత్ ఎల్లప్పుడూ పాటుపడుతూనే ఉన్నదని, యూఎన్ అజెండాను అనుసరిస్తూనే ఉన్నదని తెలిపారు. యూఎన్ ఆవిర్భవించిన తర్వాత 50 వ్యవస్థాపక సభ్యదేశాల్లో భారత్ ఒకటని గుర్తుచేశారు. ఆది నుంచీ యూఎన్ అభివృద్ధి కార్యక్రమాలకు, ఈసీవోఎస్‌వోసీకి మద్దతునిస్తూనే వస్తున్నదని వివరించారు. ఈసీవోఎస్‌వోసీ తొలి అధ్యక్షుడు భారతీయుడేనని, ఈసీవోఎస్‌వోసీ అజెండా రూపకల్పనలో భారత్‌ కీలక పాత్ర పోషించిందని తెలిపారు.

Tags:    

Similar News