కరోనా వేళ.. ఊరి కట్టుబాట్లు

దిశ, ఖ‌మ్మం: ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తుండటంతో ఊరి కట్టుబాట్లు అమలులోకి వస్తున్నాయి. చాలా ప్రాంతాల ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించుకుంటున్నారు. జిల్లాలో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతున్న కేసులను కట్టడి చేయాలంటే ఇదొక్కటే మార్గమని అభిప్రాయ పడ్డారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణ సముదాయాలు తెరిచి ఉంచేలా తీర్మానించుకుంటున్నారు. అలాగే హైద‌రాబాద్ స‌హా ఇత‌ర ప్రాంతాల నుంచి ఎవరైనా కొత్త‌గా ఊరిలోకి, కాల‌నీలోకి […]

Update: 2020-07-05 10:14 GMT

దిశ, ఖ‌మ్మం: ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తుండటంతో ఊరి కట్టుబాట్లు అమలులోకి వస్తున్నాయి. చాలా ప్రాంతాల ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించుకుంటున్నారు. జిల్లాలో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతున్న కేసులను కట్టడి చేయాలంటే ఇదొక్కటే మార్గమని అభిప్రాయ పడ్డారు.

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణ సముదాయాలు తెరిచి ఉంచేలా తీర్మానించుకుంటున్నారు. అలాగే హైద‌రాబాద్ స‌హా ఇత‌ర ప్రాంతాల నుంచి ఎవరైనా కొత్త‌గా ఊరిలోకి, కాల‌నీలోకి వ‌చ్చిన వెంట‌నే స‌మాచారం అందించేలా నిబంధ‌న‌లు విధించుకున్నారు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబుతో బాధ‌ప‌డేవారు ఉన్నా వెంట‌నే గ్రామ స‌ర్పంచ్‌కు, వార్డు కౌన్సిల‌ర్‌కు స‌మాచారం అందించాల‌ని నిర్ణయించారు.ఇప్ప‌టికే ఉమ్మ‌డి జిల్లాలోని కొత్త‌గూడెం, ఇల్లందు, భ‌ద్రాచ‌లం, మ‌ధిర‌, స‌త్తుప‌ల్లి, ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని కొన్ని ప్రాంతాల్లో, వ్యాపార స‌ముదాయాల్లో స్వ‌చ్ఛంద బంద్‌లు అమ‌ల‌వుతున్నాయి. తాజాగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో సోమవారం నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉండాలని సారపాక వర్తక సంఘం ప్ర‌తినిధులు నిర్ణ‌యించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం సభ్యులు వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ ఉపయోగిస్తూ..తమకు కావలసిన సామగ్రి తీసుకెళ్లాలని సూచించారు. చివరగా సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు రావొద్దని గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News