IND vs NZ : తొలి రోజు ఇండియాదే.. స్కోర్ ఎంతంటే ?

దిశ, వెబ్‌డెస్క్: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. తొలి టెస్ట్‌లో మొదటి రోజు ఆటలో ఇండియానే పై చేయి సాధించింది. టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్ 13 పరుగులే చేసి నిరాశపరచగా మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఔట్ అవ్వడంతో తరువాత వచ్చిన కెప్టెన్ రహానే (35), […]

Update: 2021-11-25 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. తొలి టెస్ట్‌లో మొదటి రోజు ఆటలో ఇండియానే పై చేయి సాధించింది. టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్ 13 పరుగులే చేసి నిరాశపరచగా మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు.

వీరిద్దరు ఔట్ అవ్వడంతో తరువాత వచ్చిన కెప్టెన్ రహానే (35), పుజార (26) పరుగులు మాత్రమే చేసి వెనుతిరుగగా టెస్ట్ అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ (75), రవీంద్ర జడేజా (50) పరుగులతో ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు . వీరిద్దరూ కలిసి 113 పరుగుల భాగస్వామ్యం చేసి అజేయంగా నిలిచారు . ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 258 చేసింది. మధ్యలో కాస్త తడపడ్డట్టు కనిపించినా అయ్యర్, జడేజా రాణించడంతో మొదటి రోజు ఆటలో భారతే పై చేయి సాధించింది.

Tags:    

Similar News