రో‘హిట్’ టీమిండియా స్కోర్ 300/6
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా రాణించింది. డే ముగిసే సరికి 6 వికెట్లు నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 231 బంతుల్లోనే 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) మూడు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరిగి నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన ఛతేశ్వర్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా రాణించింది. డే ముగిసే సరికి 6 వికెట్లు నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 231 బంతుల్లోనే 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) మూడు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరిగి నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన ఛతేశ్వర్ పుజార 58 బంతులు ఆడి 21 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. అభిమానుల అంచనాలకుఏ మాత్రం రీచ్ అవ్వకుండానే.. కెప్టెన్ కోహ్లీ(0) కూడా డకౌట్ అయ్యాడు.
ఇద్దరు కీలక ఆటగాళ్లు డకౌట్‌గా వెనుదిరగడం భారత్‌కు బలహీనత చేకూర్చిన.. రోహిత్ శర్మ పరుగుల వరద దానిని సమం చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహనే 149 బంతుల్లో 9 ఫోర్లు కొట్టి 67 పరుగులు చేశాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు రిషబ్ పంత్ 33 పరుగులతో క్రీజులో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అక్సర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 5 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టు 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 300 పరుగులు చేసింది.