రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తున్నది. వచ్చే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీనికితోడు ఉత్తర, వాయవ్య భారతం నుంచి రాష్ట్రంలోకి శీతలగాలులు వస్తుండటంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, దీని ప్రభావంతో మంగళవారం నుంచి మూడురోజులపాటు చలి తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీం జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 4.3 […]

Update: 2020-12-21 11:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తున్నది. వచ్చే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీనికితోడు ఉత్తర, వాయవ్య భారతం నుంచి రాష్ట్రంలోకి శీతలగాలులు వస్తుండటంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, దీని ప్రభావంతో మంగళవారం నుంచి మూడురోజులపాటు చలి తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది.

ఆదిలాబాద్‌, కుమ్రం భీం జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 4.3 డిగ్రీలకు పడిపోయాయి. అదే విధంగా ఆదిలాబాద్‌లో 4.6, వికారాబాద్‌‌లో 5, సంగారెడ్డిలో 5.1, కామారెడ్డిలో 6, నిర్మల్​లో 6.2, మెదక్​లో 6.4, మంచిర్యాలలో 7, మేడ్చల్​మల్కాజిగిరిలో 7.3 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి, రంగారెడ్డి, సిద్ధిపేట, పెద్దపల్లి, ములుగు, మమబూబ్​నగర్​, నల్గొండ, కరీంనగర్​, నాగర్​ కర్నూల్​ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

Tags:    

Similar News