మొబైల్ రైతుబజార్ల సంఖ్యను పెంచండి : మంత్రి

దిశ, వరంగల్: కరోనా విపత్తు నేపథ్యంలో మొబైల్ రైతుబజార్ల సంఖ్యను పెంచి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఎక్సైజ్ కాలనీ రైతుబజార్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం పది గంటల వరకే ప్రజలకు కూరగాయలు అందేలా చూడాలన్నారు.వరంగల్‌లో 20 మొబైల్ రైతుబజార్లతో కూరగాయలు సరఫరా చేస్తున్నందున వీలైనన్ని ఎక్కువ […]

Update: 2020-04-02 01:34 GMT

దిశ, వరంగల్:

కరోనా విపత్తు నేపథ్యంలో మొబైల్ రైతుబజార్ల సంఖ్యను పెంచి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఎక్సైజ్ కాలనీ రైతుబజార్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం పది గంటల వరకే ప్రజలకు కూరగాయలు అందేలా చూడాలన్నారు.వరంగల్‌లో 20 మొబైల్ రైతుబజార్లతో కూరగాయలు సరఫరా చేస్తున్నందున వీలైనన్ని ఎక్కువ రైతుబజార్లు ఏర్పాటు చేసి ప్రజలు మార్కెట్ వచ్చే పనిని తప్పించాలన్నారు. రైతుబజార్లను పరిశుభ్రంగా ఉంచాలని, మార్కెట్లలో సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. అమ్మేవారు, కొనేవారు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరమే కరోనా వైరస్ నియంత్రణకు మార్గమన్నారు. ప్రజలు బాధ్యతతో ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.

Tags: Increase,farmer bazaars, warangal, ministers niranjanreddy, errabelli

Tags:    

Similar News