వైద్యశాఖలో మరో పంచాయితీ.. మంత్రి హరీష్‌కు సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు పీజీ చదివేందుకు సర్కార్ కల్పించే ఇన్‌సర్వీస్ కోటా ప్రత్యేక రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇన్సర్వీస్కోటా ఇవ్వడం వలన తమకు అన్యాయం జరుగుతుందంటూ జూడాలు, తక్కువ శాతం ఇచ్చారంటూ సర్కార్ వైద్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేస్తే బాగుంటుందని అధికారులు అంతర్గతంగా పరిష్కారాన్ని అన్వేషిస్తున్నారు. ఇప్పటికే రెండు వర్గాల డాక్టర్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును ప్రత్యేకంగా కలిసి సమస్యలను వివరించారు. సీఎం దృష్టికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు పీజీ చదివేందుకు సర్కార్ కల్పించే ఇన్‌సర్వీస్ కోటా ప్రత్యేక రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇన్సర్వీస్కోటా ఇవ్వడం వలన తమకు అన్యాయం జరుగుతుందంటూ జూడాలు, తక్కువ శాతం ఇచ్చారంటూ సర్కార్ వైద్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేస్తే బాగుంటుందని అధికారులు అంతర్గతంగా పరిష్కారాన్ని అన్వేషిస్తున్నారు. ఇప్పటికే రెండు వర్గాల డాక్టర్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును ప్రత్యేకంగా కలిసి సమస్యలను వివరించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన రెండు వర్గాలకు హామీ ఇచ్చారు. కానీ ఇన్ సర్వీస్ కోటాపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.155ను వెంటనే రద్దు చేయాలంటూ జూడాలు గత రెండు రోజులుగా టీచింగ్ ఆసుపత్రుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు కూడా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
20 రోజుల పాటు రీసెర్చ్..
2017లో రద్దైన ఇన్ సర్వీస్కోటా సుమారు మూడేళ్ల తర్వాత పున:ప్రారంభమైంది. కానీ, దీన్ని షురూ చేసే ముందే డాక్టర్ల నుంచి వచ్చే సమస్యలు, నష్టాలు, ఉపయోగాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. ఆ కమిటీలో డీఎంఈ డా రమేశ్‌రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస రావులు ఉన్నారు. వీరు ఇన్సర్వీస్కోటా అమలుపై 20 రోజుల పాటు స్డడీ చేసి సర్కార్‌కు రిపోర్టును అందించారు. నాన్క్లినికల్ విభాగంలోని 40 శాతం, క్లినికల్‌లో 20 శాతం సీట్లను కేటాయించాలని కమిటీ సూచించింది.
దీని వలన సర్కార్ ఆసుపత్రుల్లో వైద్యులు పెరగడమే కాకుండా, గ్రామాల్లోనూ వైద్యసేవలు మరింత మెరుగవుతాయని వివరించారు. కానీ, ప్రభుత్వం క్లినికల్‌లో 20 శాతం, నాన్క్లినికల్లో 30 శాతాన్ని కుదిస్తూ ఇన్సర్వీస్కోటా కింద అప్రూవ్చేసింది. అయితే, దీన్ని జూడాలు వ్యతిరేకిస్తున్నారు. దీని వలన రెగ్యులర్‌గా చదువుతున్న వారికి సీట్లు తగ్గుతాయని, కావాలంటే సర్వీస్‌లో ఉన్నోళ్లకు 30 శాతం వెయిటేజ్ఇవ్వాలని గాంధీ జూనియర్ డాక్టర్ కార్తిక్ తెలిపారు.
ప్రైవేట్‌లోనూ ఇవ్వండి..
ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేద్దామనుకుంటున్న ఇన్‌సర్వీస్ కోటా శాతాన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ వైద్యులు కోరుతున్నారు. దీని వలన తమకు లాభం జరగడమే కాకుండా, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పబ్లిక్హెల్త్డాక్టర్స్అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి జనార్ధన్పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 4 సర్కార్ఆసుపత్రులతో పాటు 13 ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు లభిస్తాయన్నారు. ఫీజులు కూడా తామే భరిస్తామన్నారు. అంతేగాక ప్రైవేట్‌లో పీజీ పూర్తి చేసిన తర్వాత కచ్చితంగా పదేళ్లు సర్కార్‌లోనే సేవలు అందిస్తామన్నారు. అవసరమైతే ఆ గడువును పొడిగించినా పర్వాలేదన్నారు. జీవో నెం.155 తమ గొంతు కోసే విధంగా ఉన్నదని, దానిలో మార్పులు చేస్తూ ప్రైవేట్కాలేజీలకు వర్తింపచేయాలన్నారు. తాము ప్రజలకు సేవ చేస్తున్న వాళ్లమని, కావున ప్రభుత్వం కనికరం చూపాలని విజ్ఞప్తి చేశారు.