దుబ్బాకలో 3 గంటలకు పోలింగ్‌శాతం ఎంతంటే..
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 71.10 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో ఓటర్ల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఓటర్లు భౌతికదూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల్లో మార్కింగ్ వేశారు. […]
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 71.10 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో ఓటర్ల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఓటర్లు భౌతికదూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల్లో మార్కింగ్ వేశారు. అంతేగాకుండా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడూ జిల్లా కలెక్టర్ భారతి హోళికేరితో పాటు అధికారులు పరిశీలిస్తున్నారు.