ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 7,948 కేసులు

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 7,948 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,367, కర్నూలులో 1,146, గుంటూరులో 945 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,10,297కి చేరగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 56,527 చేరింది. ఇప్పటివరకూ […]

Update: 2020-07-28 06:30 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 7,948 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,367, కర్నూలులో 1,146, గుంటూరులో 945 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,10,297కి చేరగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 56,527 చేరింది. ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 52,622 గా ఉంది. తాజాగా 58 మంది మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,148కి చేరింది.

గుంటూరు జిల్లాలో 11 మంది, కర్నూలు జిల్లాలో 10, విశాఖపట్నం జిల్లాలో తొమ్మిది, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతిచెందారు. కడపలో ముగ్గురు మృత్యువాత పడగా.. కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఒక్క రోజులో 62,979 నమూనాలు పరీక్షించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News