నగరవాసులకు హెచ్చరిక.. ఈరోజే లాస్ట్.. చెల్లించకపోతే ఫైన్ తప్పదు

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం ఆస్తిప‌న్ను చెల్లించ‌డానికి ఈ రోజు అర్ధరాత్రి వరకు అవకాశం ఇస్తున్నట్లు జీఎచ్ఎంసీ తెలిపింది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం బుధవారం అర్థరాత్రి వరకూ జీహెచ్ఎంసీలోని అన్ని సిటీజ‌న్ స‌ర్వీస్ కేంద్రాలు య‌థావిధిగా ప‌నిచేయనున్నాయి. ఆర్థిక సంవత్సరంలోపు పన్నులు చెల్లించని పక్షంలో జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ఆస్తిప‌న్ను బ‌కాయిల‌పై రెండు శాతం జ‌రిమానా విధించ‌నున్నట్టు పేర్కొంది. సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లతో పాటు మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ ద్వారా […]

Update: 2021-03-31 04:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం ఆస్తిప‌న్ను చెల్లించ‌డానికి ఈ రోజు అర్ధరాత్రి వరకు అవకాశం ఇస్తున్నట్లు జీఎచ్ఎంసీ తెలిపింది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం బుధవారం అర్థరాత్రి వరకూ జీహెచ్ఎంసీలోని అన్ని సిటీజ‌న్ స‌ర్వీస్ కేంద్రాలు య‌థావిధిగా ప‌నిచేయనున్నాయి. ఆర్థిక సంవత్సరంలోపు పన్నులు చెల్లించని పక్షంలో జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ఆస్తిప‌న్ను బ‌కాయిల‌పై రెండు శాతం జ‌రిమానా విధించ‌నున్నట్టు పేర్కొంది.

సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లతో పాటు మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులకు అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం ఆస్తిప‌న్ను ల‌క్ష్యంపెంచి రూ. 1900 కోట్లుగా నిర్థారించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వ‌ర‌కు రూ. 1559.38 కోట్లు వ‌సూల‌యినట్టు ట్యాక్స్ విభాగం తెలిపింది. బుధవారం చివరి రోజు కావడంతో చెల్లింపుల కోసం సిటీజన్స్ క్యూ కట్టారు.

 

Tags:    

Similar News