ఫేస్‌బుక్‌లో అవుట్.. ఇన్ స్టాగ్రామ్‌లోకి ఇన్..!
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజ ఫ్లాట్‌ఫాం ఇన్ స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్‌ను తగ్గించే దిశగా అడుగులు వేయనుందా..? ఈ ప్రశ్నకు సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్‌నవర్ర (Matt Navarra) షేర్ చేసిన ఓ ఫొటో అవుననే సమాధానం చెబుతుంది. ఇక నుంచి ఇన్ స్టాగ్రామ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం సెల్ఫీ వీడియోలను అడగనుంది అంటూ మాట్ నవర్ర ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అందులో ఇన్ స్టాగ్రామ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం సెల్ఫీ వీడియో […]
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజ ఫ్లాట్‌ఫాం ఇన్ స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్‌ను తగ్గించే దిశగా అడుగులు వేయనుందా..? ఈ ప్రశ్నకు సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్‌నవర్ర (Matt Navarra) షేర్ చేసిన ఓ ఫొటో అవుననే సమాధానం చెబుతుంది. ఇక నుంచి ఇన్ స్టాగ్రామ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం సెల్ఫీ వీడియోలను అడగనుంది అంటూ మాట్ నవర్ర ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అందులో ఇన్ స్టాగ్రామ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం సెల్ఫీ వీడియో అడుగుతుంది. ఇన్‌స్టా అకౌంట్ వాడే వ్యక్తి నిజమైన వ్యక్తా.. కాదా అని వెరిఫై చేయటానికి వీడియో రికార్డు సమయంలో ఆ వ్యక్తి తలను డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వీడియో స్టోర్ చేస్తుంది. ఈ వీడియోను బ్యాక్ ఎండ్‌లో స్టోర్ చేయరని.. 30 రోజుల్లో డిలీట్ చేసేస్తారని కంపెనీ చెబుతోంది. బయోమెట్రిక్‌ను అడగటం లేదని, కేవలం ఫేస్ రిక్ననైజేషన్ కోసం మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ఇది ఇలా ఉండగా తాజాగా ఫేస్‌బుక్ వ్యక్తిగత గోప్యత వివరాలు, డేటా లీక్ వంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ‘ఫేస్ రికగ్నిషన్’ ఫీచర్‌ను తొలిగిస్తున్నట్టు ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ ప్రకటించిన విషయం తెలిసిందే..
Instagram is now using video selfies to confirm users identity
Meta promises not to collect biometric data. pic.twitter.com/FNT2AdW8H2
— Matt Navarra (@MattNavarra) November 15, 2021