ట్రంప్ తొలగింపునకు రంగం సిద్ధం..?
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎట్టిపరిస్థితుల్లోనైనా శ్వేతసౌధం నుంచి పంపించేందుకు అమెరికన్ సెనెట్ సభ్యులు రంగం సిద్ధం చేశారు. తాజాగా మరోసారి ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టారు. ప్రస్తుతం దీనిపై ఓటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ట్రంప్‌కు వ్యతిరేకంగా 215 మందికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు సెనెట్ సభ్యులు తీర్మాణించారు.ఇదిలాఉండగా, ఒకే టర్మ్‌లో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడుగా ట్రంప్ చెత్త రికార్డును […]
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎట్టిపరిస్థితుల్లోనైనా శ్వేతసౌధం నుంచి పంపించేందుకు అమెరికన్ సెనెట్ సభ్యులు రంగం సిద్ధం చేశారు. తాజాగా మరోసారి ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టారు. ప్రస్తుతం దీనిపై ఓటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ట్రంప్‌కు వ్యతిరేకంగా 215 మందికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు సెనెట్ సభ్యులు తీర్మాణించారు.ఇదిలాఉండగా, ఒకే టర్మ్‌లో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడుగా ట్రంప్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.
కాగా, అధికార బదిలీ జరగకుండా ఉండేందుకు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ట్రంప్ మద్దతుదారులు రేకెత్తించిన హింసనే అభిశంసన తీర్మానానికి దారితీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.