రైతులకు వాతావరణశాఖ శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: రైతులకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుభవార్త తెలిపింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాల వల్ల 101 శాతం వర్షాలు పడతాయంది. ఉత్తర, దక్షిణ, వాయువ్య భారతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మధ్య భారతంలో అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాల రాక ఆలస్యమైనా సరే.. సాధారణ వర్షపాతం దేశంలో నమోదవుతుందని స్పష్టం చేసింది.