స్టాండింగ్ కమిటీ సమావేశం..
జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్, మహ్మద్ అబ్దుల్ రెహమాన్, ఎండీ ముస్తఫా అలీ, మహ్మద్ మాజిద్ హుస్సేన్, ఎం.మమత, ఎక్కెల చైతన్య కన్నా, మహ్మద్ అఖీల్ అహ్మద్, షేక్ హమీద్, తొంట అంజయ్య, సబీహా బేగం, సామల హేమ, జీహెచ్ఎంసీ అధికారులు విజిలెన్స్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్లు […]
జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్, మహ్మద్ అబ్దుల్ రెహమాన్, ఎండీ ముస్తఫా అలీ, మహ్మద్ మాజిద్ హుస్సేన్, ఎం.మమత, ఎక్కెల చైతన్య కన్నా, మహ్మద్ అఖీల్ అహ్మద్, షేక్ హమీద్, తొంట అంజయ్య, సబీహా బేగం, సామల హేమ, జీహెచ్ఎంసీ అధికారులు విజిలెన్స్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్లు కెనడి, విజయలక్ష్మి, వి కృష్ణ, శంకరయ్య, ప్రియాంక అలా, జోనల్ కమిషనర్లు అశోక్ సామ్రాట్, పి ప్రావిణ్య, బి శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఎన్ రవికిరణ్, వి మమత, సీసీపీ దేవేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ హౌసింగ్ సురేష్, చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్ హాజరయ్యారు.సమావేశంలో3 ఎజెండా అంశాలను చర్చించి ఆమోదించారు.
ఆమోదించిన తీర్మానాలు :
చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో జంగంపేట డివిజన్-45లో రాజన్నబావి నాలా వద్ద మిగిలిపోయిన డ్రెయిన్ బాక్స్ వెడల్పు పనులకు రూ.2కోట్ల 9లక్షలతో ఆమోదం. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు ఈవీడీఎం డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ అధికారులు, వర్కర్లకు వేతనాలు చెల్లింపునకు టెండర్లను 10 ప్యాకేజిలుగా పిలుచుటకు ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ అన్నపూర్ణ మీల్స్ ప్రాజెక్ట్ రూ.5/-భోజన పథకాన్ని నిర్వహించేందుకు ఇతర ఏజెన్సీలు లభించనందున ప్రస్తుతం నడుపుతున్న హరేరామ హరేకృష్ణ ట్రస్ట్‌కే ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేయుటకు ఆమోదం తెలిపారు.