నేను ఇందిరాగాంధీ మనవరాలిని: ప్రియాంక
లక్నో: ‘ఎమర్జెన్సీ’ 45 ఏళ్లు నిండిన సందర్భంగా బీజేపీ అగ్రనేతలందరూ ఇందిరాగాంధీపై విమర్శలు చేసిన తదుపరి రోజే ప్రియాంక వాద్రా గాంధీ కీలకవ్యాఖ్యలు చేశారు. తాను ఇందిరా గాంధీ మనవరాలిని అని, నిజాలను నిర్భయంగా బయటపెడుతారని శుక్రవారం ట్వీట్ చేశారు. యూపీ ఆధ్వర్యంలోని షెల్టర్ హోంలో ఇద్దరు చిన్నారి గర్భిణీలకు సంబంధించిన కథనాన్ని పేర్కొంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వంపై కౌంటర్ ఎటాక్ చేస్తూ ‘వారు […]
లక్నో: ‘ఎమర్జెన్సీ’ 45 ఏళ్లు నిండిన సందర్భంగా బీజేపీ అగ్రనేతలందరూ ఇందిరాగాంధీపై విమర్శలు చేసిన తదుపరి రోజే ప్రియాంక వాద్రా గాంధీ కీలకవ్యాఖ్యలు చేశారు. తాను ఇందిరా గాంధీ మనవరాలిని అని, నిజాలను నిర్భయంగా బయటపెడుతారని శుక్రవారం ట్వీట్ చేశారు. యూపీ ఆధ్వర్యంలోని షెల్టర్ హోంలో ఇద్దరు చిన్నారి గర్భిణీలకు సంబంధించిన కథనాన్ని పేర్కొంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వంపై కౌంటర్ ఎటాక్ చేస్తూ ‘వారు నాపై ఏ చర్యలైనా తీసుకోనివ్వండి. నిజాలను బయటపెడుతూనే ఉంటా. ఇతర ప్రతిపక్షపార్టీలో బీజేపీ వకాల్తా పుచ్చుకున్న నేతను కాదు నేను. నేను, ఇందిరా గాంధీ మనవరాలిని’ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.