‘మంజీర’ను తోడేస్తున్న ఇసుకాసురులు..

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మంజీరా నదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అభివృద్ధి పనుల పేరిట అడ్డగోలుగా తవ్వి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ అండదండలు, యంత్రాంగం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం తో వారి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. టీఎస్ ఎండీసీ ని బంధనలకు విరుద్ధంగా నదీ గర్భంలో తవ్వుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఆధారం మంజీరా నది. నిజాంసాగర్ మండలం బంజేపల్లి-అచ్చంపేట్ వద్ద మంజీరా నదిపై నిజాం సాగర్ నిర్మాణం కాగా […]

Update: 2020-09-13 22:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మంజీరా నదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అభివృద్ధి పనుల పేరిట అడ్డగోలుగా తవ్వి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ అండదండలు, యంత్రాంగం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం తో వారి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. టీఎస్ ఎండీసీ ని బంధనలకు విరుద్ధంగా నదీ గర్భంలో తవ్వుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఆధారం మంజీరా నది. నిజాంసాగర్ మండలం బంజేపల్లి-అచ్చంపేట్ వద్ద మంజీరా నదిపై నిజాం సాగర్ నిర్మాణం కాగా అక్కడి నుంచి బిచ్కుంద, బాన్సువాడ, భీర్కూర్, కోటగిరి, బోధన్, రెంజల్ మండలాల గుండా నది సాగుతూ రెంజల్ మండలం కందకుర్తి గ్రామం వద్దనున్న త్రివేణి సంగమం వద్ద గోదావరిలో కలుస్తుంది. కర్ణాటకలో మొదలయ్యే మంజీరా నది పరీవాహక ప్రాంతమంతా వేసవి కాలంలో ఇసుక మేటలు వేస్తుంటాయి. ఇవేఅక్రమార్కులకు దందా కాసులు కురిపిస్తోంది.

ప్రభుత్వ అభివృద్ధి పనులు పేరిట..

మంజీరా నది గర్భంలో ఏర్పడిన ఇసుక మేటలపై కొందరు గుత్తేదారుల కన్ను పడింది. అధికార పార్టీ అండదండలతో సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని ఇసుకను కొల్లగొడుతున్నారు. అయితే ఇసుక తవ్వకాలు గుత్తేదారుల వద్ద నున్న ఏకైక ఆస్త్రం ప్రభుత్వ పనులకు అనుమతి ఉన్న రిసిప్ట్​లే. పక్షం రోజుల క్రితం టీఎస్​ ఎండీసీ నుంచి అనుమతి ఇచ్చిన బీర్కూర్, కుర్ల, హస్గుల్, కత్ గాం, బిచ్కుంద క్వారీలో అనుమతి ఉన్న క్యూబిక్ మీటర్లకు మించి ఎక్కువగా తవ్వేస్తున్నారు. ట్రాన్సిట్ రిసిప్ట్​కు రవాణాకు సంబంధం లేకుండా ఇసుక దందా కొనసాగుతోంది. నది ఒడ్డున మనుషుల చేత ఇసుకను తవ్వాల్సిన చోట నిబంధనలకు విరుద్ధం గా నదీ గర్భంలో భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. వందల సం ఖ్యలో టిప్పర్ల ద్వారా హైదరాబాద్, బీదర్,​ నిజామాబాద్, కామా రెడ్డి ప్రాంతాలకు ఆక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోటగిరి మండలం సుంకిని, కల్లూర్, పోతంగల్, హంగర్గ, కోడి చర్ల నుంచి బీర్కూర్ మండలం బీర్కూర్, బరంగెడిగి, కిష్టాపూర్, దామరంచ, బాన్సువాడ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అధికార పార్టీ నేతలు, అధికారుల పుత్రరత్నాలే బినామీలు..

ఉమ్మడి రాష్ర్టం నుంచి ఇసుక మేటల పేరుతో జరుగుతున్న దందాకు తోడు ప్రైవేట్ పట్టా భూములు పుట్టుక రావడం, అక్కడి నుంచి ఇసుక తరలింపు సహజంగానే జరిగేది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేది గుత్తేదారులే అయినా వారి వెనుక మా త్రం అధికారపార్టీ ముద్ర కనబడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పుత్రరత్నం కనుసన్నల్లోనే కొందరి పేర దందా సాగుతోందని ఉమ్మడి జిల్లాలో కోడై కూస్తోంది. అంతే కాకుండా కామారెడ్డి జిల్లా శివారు మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్​స్పెక్టర్ ​పుత్రరత్నం క్వారీ వ్యవహరాలను అధికార పార్టీ నేత తనయుడి పక్షాన చక్కబెడుతున్నట్టు వినికిడి. అనుమతి ఉన్న క్వారీల నుంచి అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నా అధికారులెవరూ అడ్డు చెప్పరనే విషయం అందరికీ తెలిసిందే.

అక్రమ తవ్వకాలను నిలిపివేయాలి ..

నదీ గర్భంలో జరుగుతున్న ఇసుక ఆక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని బీర్కూర్ మండల పరిషత్ అధ్యక్షుడు, టీఆర్​ఎస్​నాయకుడు రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం బీర్కుర్ మండలంలోని ఇసుక క్వారీలను ఎంపీపీ రైతు సమన్వయ సమితి నాయకులు అవారి గంగారాం, ఎంపీటీసీ సందీప్, ఆరిఫ్​లు తహసీల్దార్​ గణేశ్, స్థానిక ఎస్సైలతో కలిసి పరిశీలించారు. మంజీరా నదిలో భారీ యంత్రాలతో జరుగుతున్న ఇసుక తవ్వకాలను చూసి అవాక్కయ్యారు. నిబంధనలకు విరు ద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై గుత్తేదారును నిలదీశారు. తక్షణం మండలంలోని ఇసుక క్వారీలను నిలిపివేయాలని ప్రభుత్వానికి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి రైతుల పక్షాన విన్నవిస్తామని ఎంపీపీ రఘు పేర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటేలా జరుగుతున్న ఇనుక ఆక్రమ తవ్వకాలు నిలిపివేసే వరకూ న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News