అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు
దిశ, కాజీపేట : కాజీపేట ప్రాంతంలో పలు డివిజన్లలో అక్రమ కట్టడాలను బల్దియా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలసి అధికారులు శనివారం కూల్చివేశారు. కాజీపేట 62 వ డివిజన్ ప్రాంతంలో 30 ఫీట్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్ బాల్కనీ తొలగించారు. అలాగే 60 వ డివిజన్ ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు ఆక్రమించి నిర్మిస్తున్న స్లాబ్ పిల్లర్స్, టీచర్స్ కాలనీ ఫేస్-2 లో 40 ఫీట్ రోడ్డు ఆక్రమించి నిర్మించిన కాంపౌండ్ గోడలను, మెట్లను […]
దిశ, కాజీపేట : కాజీపేట ప్రాంతంలో పలు డివిజన్లలో అక్రమ కట్టడాలను బల్దియా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలసి అధికారులు శనివారం కూల్చివేశారు. కాజీపేట 62 వ డివిజన్ ప్రాంతంలో 30 ఫీట్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్ బాల్కనీ తొలగించారు. అలాగే 60 వ డివిజన్ ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు ఆక్రమించి నిర్మిస్తున్న స్లాబ్ పిల్లర్స్, టీచర్స్ కాలనీ ఫేస్-2 లో 40 ఫీట్ రోడ్డు ఆక్రమించి నిర్మించిన కాంపౌండ్ గోడలను, మెట్లను తొలగించారు.
అలాగే ఎన్జీవోస్ కాలనీ రోడ్‌లో పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాన్ని జెసీబీ సాయంతో నేలమట్టం చేశారు. మిగతా నిర్మాణాలను 24 గంటల్లోపు తీసేయాలని లేని పక్షంలో వాటిని కూల్చివేసి క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని అసిస్టెంట్ సిటీ ప్లానర్ కడారి సుష్మ పేర్కొన్నారు. నిబంధనలు పాటించని పక్షంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ కడారి సుష్మ, బిక్షపతి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, ప్రవీణ్ బాబు, శ్రావణి, అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శైలేందర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జైపాల్‌రెడ్డి, ఆర్ అండ్ బి రాజశేఖర్, పోలీస్ సిబ్బంది చైన్ మెన్‌లు, డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఇతర సిబ్బంది పాల్గోన్నారు.