సాగరులకు తన వంతు సహాకారం.. ఎమ్మెల్సీ రాజు
దిశ, కుత్బుల్లాపూర్ : సాగరుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ సాగర(ఉప్పర) సంఘం నూతన సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం ఎమ్మెల్సీని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్పందించిన రాజు మాట్లాడుతూ.. కార్యవర్గ సభ్యులకు అభినందనలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సామాజిక వర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఐక్యమత్యంతో ముందుకెళ్లి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సాగర […]
దిశ, కుత్బుల్లాపూర్ : సాగరుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ సాగర(ఉప్పర) సంఘం నూతన సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం ఎమ్మెల్సీని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్పందించిన రాజు మాట్లాడుతూ.. కార్యవర్గ సభ్యులకు అభినందనలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సామాజిక వర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.
ఐక్యమత్యంతో ముందుకెళ్లి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సాగర మహిళ భవనం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్కే దయాసాగర్, ప్రధాన కార్యదర్శి ఆస్కాని శ్రీనివాస్ సాగర్, కోశాధికారి సుదర్శన్ సాగర్,మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆస్కాని తిరుపతమ్మ సాగర్, ఆర్ డి శాంత, కోశాధికారి పి. హేమలత తదితరులు పాల్గొన్నారు.