యురేకా జూనియర్.. విజేతకు రూ. 1.5 లక్షల స్కాలర్‌షిప్!

దిశ, ఫీచర్స్ : 6 నుంచి 12 తరగతులకు చెందిన విద్యార్థుల్లో ‘ఆంత్రప్రెన్యూర్‌షిప్’‌ను ప్రోత్సహించేందుకు ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి.. ఎడ్-టెక్ యాప్‌ ‘ప్రాక్టికల్’ భాగస్వామ్యంతో ‘యురేకా’ జూనియర్ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీ కోసం విద్యార్థులు గరిష్టంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందంగా నమోదు చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా పాల్గొనేవారు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశముంది. ఆసక్తిగల విద్యార్థులు 26 అక్టోబర్ 2021లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒలింపియాడ్‌ను 31 […]

Update: 2021-10-24 08:42 GMT

దిశ, ఫీచర్స్ : 6 నుంచి 12 తరగతులకు చెందిన విద్యార్థుల్లో ‘ఆంత్రప్రెన్యూర్‌షిప్’‌ను ప్రోత్సహించేందుకు ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి.. ఎడ్-టెక్ యాప్‌ ‘ప్రాక్టికల్’ భాగస్వామ్యంతో ‘యురేకా’ జూనియర్ పోటీని నిర్వహిస్తోంది.

ఈ పోటీ కోసం విద్యార్థులు గరిష్టంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందంగా నమోదు చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా పాల్గొనేవారు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశముంది. ఆసక్తిగల విద్యార్థులు 26 అక్టోబర్ 2021లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒలింపియాడ్‌ను 31 అక్టోబర్ 2021న ‘ప్రాక్టికల్’ టెస్ట్ ప్లాట్‌ఫామ్‌లో హోస్ట్ చేస్తారు. పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు ‘ప్రాక్టికల్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కోసం 6 నుంచి ఇంటర్ వరకు మూడు గ్రూపు(6 – 8, 9 – 10, 11- 12)లుగా విభజించబడతారు. అన్ని విభాగాల్లో మొదటి ఇద్దరు విజేతలకు రూ. 1.5 లక్షల వరకు విలువైన ప్రాక్టికల్‌ స్కాలర్‌షిప్‌తో పాటు ఐఐటీ బాంబే నుంచి రూ.15,000 నగదు బహుమతిని కూడా అందుకుంటారు. పోటీకి సంబంధించిన అన్ని దశలు(ఫేజెస్) ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన కాంపిటీషన్ కో ఫౌండర్ చారు నోహెరియా.. ‘దేశవ్యాప్తంగా విజయవంతమైన ‘ఆంత్రప్రెన్యూర్స్’ తరాన్ని సృష్టించాలనుకుంటున్నాం. విద్యార్థులు దీన్ని సాధించడంలో అధిక-నాణ్యత గల కంటెంట్, IIT బాంబే ప్రతిష్టాత్మక వారసత్వం సాయపడుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఆసక్తితో పాటు అర్హత గల విద్యార్థులు ‘ప్రాక్టికల్’‌ యాప్‌లో తమ వ్యక్తిగత, పాఠశాల వివరాలతో పాటు కాంటాక్ట్ డీటెయిల్స్‌ను ఫారమ్‌లో నింపాలి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ కోసం విద్యార్థులు అందించిన ఐడీకి మెయిల్ వస్తుంది. ఈ మేరకు భవిష్యత్తులో జరిగే అన్ని కరస్పాండెన్స్‌ల కోసం సరైన ఈమెయిల్ ఐడీని నమోదు చేశామని వారు నిర్ధారించుకోవాలి.

పోటీ వివరాలు :

యురేకా! జూనియర్ లాంచ్ – 22 ఆగస్టు 2021
రిజిస్ట్రేషన్ గడువు – 26 అక్టోబర్ 2021
ఒలింపియాడ్ – 31 అక్టోబర్ 2021
సెమీఫైనలిస్ట్ డిక్లరేషన్ – 25 నవంబర్ 2021
అడ్వాన్స్ వర్క్‌షాప్ – 4 , 5 డిసెంబర్ 2021
మెంటారింగ్ – 6 డిసెంబర్ 26 నుండి 2021 వరకు
ఫైనల్ సబ్‌మిషన్ – 10 జనవరి 2022
ఫైనల్ డిక్లరేషన్ – 22 జనవరి 2022
పిచింగ్ ప్రాక్టీస్ – 28 , 29 జనవరి 2022
ఫైనల్స్ – ఫిబ్రవరి 1వ వారం

వర్క్‌షాప్ : ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఐడియా జనరేషన్, ఐడియా వాలిడేషన్ వంటి ప్రాథమిక అంశాలను కవర్ చేసే ఉచిత ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ సబ్‌మిషన్ : సెమీ ఫైనలిస్టులు అడ్వాన్స్‌డ్ వర్క్‌షాప్‌కు రావడానికి ముందు వారి స్టార్టప్ ఆలోచనలోని వివిధ అంశాలను కవర్ చేసే పిచ్ డెక్ (ప్రజెంటేషన్) సమర్పించాల్సి ఉంటుంది.
అడ్వాన్స్ వర్క్‌షాప్ : సెమీఫైనలిస్టులు అడ్వాన్స్‌డ్ వర్క్‌షాప్‌ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
మార్గదర్శకత్వం : విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరచడంలో సహాయపడేందుకు బృందాలకు మార్గదర్శకులు కేటాయించబడతారు.
ఫైనల్స్ : ఫైనల్స్ ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి, ఇక్కడ ఫైనలిస్టులు తమ ప్రారంభ ఆలోచనను న్యాయమూర్తుల ప్యానెల్ ముందు పిచ్ చేయాలి.

మీకు ఏవైనా సందేహాలు ఉంటే.. junior@ecell.in లేదా eureka2021@ecell.in‌ను సంప్రదించవచ్చు.

Tags:    

Similar News