ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా.. రూ.10000 విత్‌డ్రా చేసుకోండిలా
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో జన్ ధన్ ఖాతా పథకాన్ని ఆగస్టు 28, 2014న దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ప్రతి ఒక్క పేద మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు సేవలు చేరవేయడం దీని లక్ష్యం. మామూలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలంటే మొదటగా కొంత డబ్బును కట్టాల్సి ఉంటుంది. కానీ జన్ ధన్ ఖాతాలకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంకు నుంచి అయినా జన్ ధన్ ఖాతా(జీరో […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో జన్ ధన్ ఖాతా పథకాన్ని ఆగస్టు 28, 2014న దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ప్రతి ఒక్క పేద మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు సేవలు చేరవేయడం దీని లక్ష్యం. మామూలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలంటే మొదటగా కొంత డబ్బును కట్టాల్సి ఉంటుంది. కానీ జన్ ధన్ ఖాతాలకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంకు నుంచి అయినా జన్ ధన్ ఖాతా(జీరో అకౌంట్) ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతా ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన పథకాల ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందించవచ్చు.
పేదల కోసం ప్రవేశపెట్టిన ఈ ఖాతాలో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మీ జన్ ధన్ ఖాతాలో ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా రూ.10,000 విత్‌డ్రా (ఓవర్‌డ్రాఫ్ట్) చేసుకునే ప్రయోజనంతో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి రూ.5,000గా ఉండేది. దాన్ని ఇప్పుడు పెంచారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.2,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ను పొందవచ్చు.
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందాలనుకుంటే, జన్ ధన్ ఖాతా కనీసం 6 నెలలుగా దీన్ని వాడాల్సి ఉంటుంది. ఖాతా వినియోగం 6 నెలల కంటే తక్కువ అయితే.. హోల్డర్లు రూ.2,000 వరకు మాత్రమే ఓవర్‌డ్రాఫ్ట్ పొందవచ్చు. ప్రభుత్వం ఓవర్‌డ్రాఫ్ట్‌కు గరిష్ట వయోపరిమితిని 60 నుంచి 65 ఏళ్లకు పెంచింది. PMJDY ఖాతాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ & రీఫైనాన్స్ ఏజెన్సీ వంటి అనేక ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా ఈ ఖాతా ద్వారా పొందవచ్చు.