లాక్‌డౌన్ వల్ల నో యూజ్: సబితా
దిశ, వెబ్‌డెస్క్: హైదారాబాద్‌లోని జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్ విధించడం వలన ఉపయోగమేమి ఉండదని దీనివల్ల చిరు వ్యాపారులు, పేద కుటుంబాలు నష్టపోతారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సమయంలో మరోసారి లాక్‌డౌన్ ఆలోచన చేస్తే దేశ పరిస్థితి మరింత దిగజారుతుందని హితవు పలికారు. అయితే, తెలంగాణలో కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు […]
దిశ, వెబ్‌డెస్క్: హైదారాబాద్‌లోని జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్ విధించడం వలన ఉపయోగమేమి ఉండదని దీనివల్ల చిరు వ్యాపారులు, పేద కుటుంబాలు నష్టపోతారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సమయంలో మరోసారి లాక్‌డౌన్ ఆలోచన చేస్తే దేశ పరిస్థితి మరింత దిగజారుతుందని హితవు పలికారు. అయితే, తెలంగాణలో కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని ఆమె వివరించారు.