కరోనా వచ్చినా కంటైన్‌మెంట్ లేదు !
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా అమీర్‌పేటలోని ఓ గల్లీలో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తమ ఇంటిని కంటైన్‌మెంట్ చేయాలని కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు కోరుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. నాలుగురోజుల క్రితం పాజిటివ్ వస్తే అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నియంత్రణ లేకపోవడంతో కొత్తవారికి కరోనా […]
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా అమీర్‌పేటలోని ఓ గల్లీలో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తమ ఇంటిని కంటైన్‌మెంట్ చేయాలని కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు కోరుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. నాలుగురోజుల క్రితం పాజిటివ్ వస్తే అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నియంత్రణ లేకపోవడంతో కొత్తవారికి కరోనా వ్యాపించే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు వస్తున్న ఆరోగ్య సిబ్బంది చెబితే తాము వైద్య పరీక్షలు మాత్రమే చేస్తామని కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటుందని చెబుతున్నట్లు తెలుస్తోంది.