ఐసీఐసీఐ త్రైమాసిక లాభం రూ. 1,221 కోట్లు!

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,221 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 969 కోట్ల నికర లాభాన్ని మాత్రమే నమోదు చేయడం గమనార్హం. అంటే, గతంతో పోలిస్తే 26 శాతం పెరిగినట్టు బ్యాంకు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఆదాయం రూ. 20,913.82 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ. 23,443.66 కోట్లని రెగ్యులేటరీ […]

Update: 2020-05-09 08:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,221 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 969 కోట్ల నికర లాభాన్ని మాత్రమే నమోదు చేయడం గమనార్హం. అంటే, గతంతో పోలిస్తే 26 శాతం పెరిగినట్టు బ్యాంకు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఆదాయం రూ. 20,913.82 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ. 23,443.66 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. స్థూల నిరర్ధక ఆస్తులు 6.70 శాతం నుంచి 5.53 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. నికర నిరర్ధక ఆస్తులు 2.06 శాతం నుంచి 1.41 శాతానికి తగ్గాయని తెలిపింది.

Tags:    

Similar News