ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా?
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేశారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియాలో ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే ఈ టోర్నీని వాయిదా వేయాలని బీసీసీఐ పట్టుబడుతుండటంతో ఐసీసీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఐసీసీ సమావేశంలో ప్రపంచ కప్ వాయిదా నిర్ణయాన్ని అధికారికంగా తీసుకోనున్నారు. ఆ తర్వాత వచ్చే వారం […]
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేశారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియాలో ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే ఈ టోర్నీని వాయిదా వేయాలని బీసీసీఐ పట్టుబడుతుండటంతో ఐసీసీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఐసీసీ సమావేశంలో ప్రపంచ కప్ వాయిదా నిర్ణయాన్ని అధికారికంగా తీసుకోనున్నారు. ఆ తర్వాత వచ్చే వారం ఐసీసీ అధికారికంగా వాయిదా విషయాన్ని వెల్లడించనుంది. ఈ సమయంలో ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్లు, ఎన్నిక ప్రక్రియపై కూడా చర్చ జరగనుంది. కాగా, వచ్చే ఏడాది ఇండియాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో ఈ ఏడాది వాయిదా పడిన టోర్నీని ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియాలో చర్చించనున్నాయి. వరల్డ్ కప్ వాయిదా పడటంతో అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించేందుకు మార్గం సుగమమం అయ్యింది.