ఐసీసీ అవార్డు రేసులో రిషబ్ పంత్
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అవార్డులు అంటే కేవలం ఏడాదికి, దశాబ్దానికి మాత్రమే ఇస్తారు. అయితే క్రికెటర్లలో ఉత్సాహం నింపడానికి ప్రతీ నెల అవార్డులు ప్రకటించాలని ఐసీసీ ఇటీవలే నిర్ణయించింది. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పేరుతో ప్రతీ నెల అవార్డులు ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో జనవరి నెలకు సంబంధించిన అవార్డుకు నామినేట్ అయిన వారి పేర్లను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. కేవలం పరుషులకే కాక మహిళలకు కూడా ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ఐసీసీ ప్లేయర్ […]
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అవార్డులు అంటే కేవలం ఏడాదికి, దశాబ్దానికి మాత్రమే ఇస్తారు. అయితే క్రికెటర్లలో ఉత్సాహం నింపడానికి ప్రతీ నెల అవార్డులు ప్రకటించాలని ఐసీసీ ఇటీవలే నిర్ణయించింది. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పేరుతో ప్రతీ నెల అవార్డులు ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో జనవరి నెలకు సంబంధించిన అవార్డుకు నామినేట్ అయిన వారి పేర్లను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. కేవలం పరుషులకే కాక మహిళలకు కూడా ఈ అవార్డులు ఇవ్వనున్నారు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో రిషబ్ పంత్, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ ఉన్నారు. ఇటీవల జరిగిన గబ్బా టెస్టులో వీరోచితంగా పోరాడి టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయంలో కీలకంగా వ్యవహరించిన రిషబ్ పంత్‌కు నామినేషన్ దక్కింది. ఇక శ్రీలంకపై 2-0 తేడాతో టెస్టు విజయం సాధించడంలో జో రూట్ కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీని నమోదు చేశాడు. ఇక ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. మహిళా క్రికెటర్లలో దియానా బేగ్ (పాకిస్తాన్), శభ్నిమ్ ఇస్మాయేల్ (దక్షిణాఫ్రికా), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా) రేసులో ఉన్నారు. ఈ నెల 7న విజేతలను ప్రకటించనున్నారు.