ఐబీఎంలో కొత్త నియామకాలు!
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తుంటే, ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం ఇండియాలో కొత్త ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించింది. ఐబీఎం వెబ్సైట్ లింక్డ్ ఇన్ పేజీలో కొత్తగా 500 నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. మేనేజర్లు, మిడిల్‌వేర్ అడ్మినిస్టేటర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్, నెట్వర్క్, డేటా సైంటిస్ట్‌ల విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా ఐబీఎం సంస్థలో 3.5 లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో మూడవ వంతు ఉద్యోగులు […]
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తుంటే, ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం ఇండియాలో కొత్త ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించింది. ఐబీఎం వెబ్సైట్ లింక్డ్ ఇన్ పేజీలో కొత్తగా 500 నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. మేనేజర్లు, మిడిల్‌వేర్ అడ్మినిస్టేటర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్, నెట్వర్క్, డేటా సైంటిస్ట్‌ల విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా ఐబీఎం సంస్థలో 3.5 లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో మూడవ వంతు ఉద్యోగులు ఇండియాలోనే ఉన్నారు. అయితే, ఐబీఎం సొంత దేశమైన అమెరికాలో కంటే ఇండియాలో ఎక్కువమందిని నియమించుకోవడం పట్ల అమెరికాలోని నిరుద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐబీఎం వంటి దిజ్జగ టెక్ కంపెనీలు ఇండియాలో ఉన్న ఐటీ నిపుణులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయని, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో కంపెనీకి ఐటీ నిపుణుల కొరత వేధిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.