ఐఏఎస్‌లు కావలెను.. నేడు సురేష్​చందా రిటైర్మెంట్​

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో మూడు ఐఏఎస్​పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ ఏడాది మొత్తం ఏడుగురు ఐఏఎస్​లు పదవీ విరమణ చేయనుండగా… వచ్చేనెల వరకు ముగ్గురు రిటైర్​ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 40కిపైగా ఐఏఎస్​ ఆఫీసర్లను కేటాయించాల్సి ఉందంటూ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తోడుగా మరో ముగ్గురు ఐఏఎస్​లు రిటైర్మెంట్​ అవుతున్నారు. బుధవారం తెలంగాణ ఫైనాన్స్​ కమిషన్​ మెంబర్​ సెక్రెటరీ సురేష్​ చందా పదవీ విరమణ చేస్తున్నారు. 1985 బ్యాచ్​కు […]

Update: 2021-03-31 01:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో మూడు ఐఏఎస్​పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ ఏడాది మొత్తం ఏడుగురు ఐఏఎస్​లు పదవీ విరమణ చేయనుండగా… వచ్చేనెల వరకు ముగ్గురు రిటైర్​ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 40కిపైగా ఐఏఎస్​ ఆఫీసర్లను కేటాయించాల్సి ఉందంటూ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తోడుగా మరో ముగ్గురు ఐఏఎస్​లు రిటైర్మెంట్​ అవుతున్నారు. బుధవారం తెలంగాణ ఫైనాన్స్​ కమిషన్​ మెంబర్​ సెక్రెటరీ సురేష్​ చందా పదవీ విరమణ చేస్తున్నారు. 1985 బ్యాచ్​కు చెందిన సురేష్​ చందా యూపీకి చెందిన వారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాలకు కలెక్టర్​గా పని చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కూడా విద్యాశాఖతో పాటుగా పలు శాఖలకు సెక్రెటరీగా చేశారు. 2018 జనవరి నుంచి ఆర్థిక సంఘం మెంబర్​ సెక్రెటరీగా ఉన్నారు. ఆయన ఐఐటీ రార్కీ (హరిద్వార్​)లో బీఈ ఎలక్ట్రానిక్స్​ చదివారు. నేటితో ఆయన పదవీ కాలం పూర్తి అవుతోంది.

వచ్చేనెలలో విద్యాశాఖ స్పెషల్​ సెక్రెటరీ చిత్రా రామచంద్రన్​ కూడా పదవీ విరమణ చేస్తున్నారు. 1985 బ్యాచ్​కు చెందిన చిత్రా రామచంద్రన్​ మహారాష్ట్రకు చెందిన వారు. 2020లో విద్యాశాఖ స్పెషల్​ సెక్రెటరీగా నియమితులయ్యారు. అదే విధంగా 2002 బ్యాచ్​కు చెందిన టి.చిరంజీవులు కూడా ఏప్రిల్​ 30న రిటైర్​ కానున్నారు. ప్రస్తుతం ఆయన ఎంసీఆర్​హెచ్ఆర్డీ డైరెక్టర్​గా ఉన్నారు. ఆయన తెలంగాణకు చెందిన వారు.

మొత్తం ఏడుగురు ఐఏఎస్​లు రిటైర్​

ఈ ఏడాదిలో మొత్తం ఏడుగురు ఐఏఎస్​లు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ముగ్గురుతో పాటుగా 2007 బ్యాచ్​కు చెందిన ఎంవీరెడ్డి మే 31న రిటైర్​ కానుండగా… 1996 బ్యాచ్​కు చెందిన ఎల్.శశిధర్​ సెప్టెంబర్​ 24న పదవీ విరమణ చేయనున్నారు. 1987 బ్యాచ్​కు చెందిన రాజీవ్​రంజన్​ మిశ్రా, 2007 బ్యాచ్​కు చెందిన డి.వెంకటేశ్వర్​రావు డిసెంబర్​ 31న రిటైర్​ అవుతున్నారు.

Tags:    

Similar News