నేను అంతా చూశాను: రహానే కెప్టెన్సిపై కోహ్లీ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు ఎంతో ఉత్కంఠంగా సాగి చివరికి డ్రా గా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడినప్పటికిీ కెప్టెన్ అజింక్యా రహానే మాత్రం అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా రాణించలేదని తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అయితే ఈ విషయంలో కోహ్లీ, రహానెకు మద్దతుగా నిలిచాడు. రెండవ టెస్టుకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనుండటంతో, రహానే చేసిన దానికంటే మీరేదైనా భిన్నంగా చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు, అతను […]
దిశ, వెబ్‌డెస్క్ : న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు ఎంతో ఉత్కంఠంగా సాగి చివరికి డ్రా గా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడినప్పటికిీ కెప్టెన్ అజింక్యా రహానే మాత్రం అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా రాణించలేదని తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అయితే ఈ విషయంలో కోహ్లీ, రహానెకు మద్దతుగా నిలిచాడు.
రెండవ టెస్టుకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనుండటంతో, రహానే చేసిన దానికంటే మీరేదైనా భిన్నంగా చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు, అతను మెుదటి మ్యాచ్‌ని చూశానని, జట్టు చేయగలిగినదంతా ప్రయత్నించారని చెప్పాడు. ” మ్యాచ్‌లో రహానే ఎప్పుడూ గొప్ప ఆలోచనలతోనే ఉన్నాడు. అతని వ్యూహంతో ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చాడు,” అని విరాట్ అభిప్రాయపడ్డాడు.