టీ20 వరల్డ్ కప్‌కు స్మిత్ దూరం..?

దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ నుంచి ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. టెన్నిస్ ఎల్బో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న స్మిత్ రాబోయే వెస్టిండీస్, బంగ్లాదేశ్ సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే టీ20 వరల్డ్ కప్‌ ఆడబోనని స్మిత్ వ్యాఖ్యానించాడు. తనకు యాషెస్ సిరీస్‌ ఎక్కువ ప్రాధాన్యత అని.. వరల్డ్ కప్ మిస్ అయ్యే అవకాశం […]

Update: 2021-07-02 11:52 GMT

దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ నుంచి ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. టెన్నిస్ ఎల్బో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న స్మిత్ రాబోయే వెస్టిండీస్, బంగ్లాదేశ్ సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే టీ20 వరల్డ్ కప్‌ ఆడబోనని స్మిత్ వ్యాఖ్యానించాడు. తనకు యాషెస్ సిరీస్‌ ఎక్కువ ప్రాధాన్యత అని.. వరల్డ్ కప్ మిస్ అయ్యే అవకాశం ఉందని అన్నాడు.

‘టీ20 వరల్డ్ కప్ ఆడటం నాకు ఇష్టమే. కానీ ప్రధాన లక్ష్యం మాత్రం యాషెస్. గత కొన్నేళ్లుగా తాను యాషెస్ ఆడుతూ వస్తున్నాను. అందులో నాకు మంచి రికార్డు ఉన్నది. కాబట్టి యాషెస్‌కు ప్రాధాన్యత ఇస్తాను’ అని స్టీవ్ స్మిత్ క్రికెట్ ఆస్ట్రేలియాకు చెప్పాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికి వెబ్‌సైట్ అతడి ఆరోగ్య వివరాలను వెల్లడించింది.

Tags:    

Similar News