రైతులు అలాంటి పంటలు వేస్తే ఇబ్బందులు ఉండవు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

రైతులు ప్రకృతి విపత్తులను తట్టుకునే పంటలు పండించడంతో పాటు మార్కెట్ విలువ కలిగి, ఎక్స్ స్పోర్ట్ చేయగలిగే కొత్త రకం పంటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.

Update: 2025-04-12 16:10 GMT
రైతులు అలాంటి పంటలు వేస్తే ఇబ్బందులు ఉండవు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు ప్రకృతి విపత్తులను తట్టుకునే పంటలు పండించడంతో పాటు మార్కెట్ విలువ కలిగి, ఎక్స్ స్పోర్ట్ చేయగలిగే కొత్త రకం పంటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. యూరియా, పెస్టిసైడ్స్ తగ్గించి పంటలు పండించాలని, రైతులు ఇలాంటి మేళాలో పాల్గొని కొత్త కొత్త వ్యవసాయ విధానాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. అన్ని రకాల పంటలు పండించేందుకు రైతులకు ఈ మేళా విజ్ఞానదాయకంగా ఉపయోగపడుతుంది. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అగ్రి, హర్టికల్చర్ సొసైటీ నిర్వహిస్తున్న తెలంగాణ రైతు మహోత్సవం సందర్శించి, అక్కడ ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను తిలకించి, రైతులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ప్రయోజనార్ధం ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలు వ్యవసాయరంగంలో వచ్చిన నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారుచేసే అనుబంధ ఉత్పత్తులు గ్రామాలలో ఉండే గ్రాస్​రూట్​ఇన్నోవేషన్​ద్వారా తక్కువ ఖర్చుతో తయారుచేసిన యంత్రాలు, పనిముట్లను ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. ఈప్రదర్శనలను జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయడానికి వ్యవసాయశాఖ కూడా నిశ్చయించిందని తెలిపారు. వాటిలో పాలుపంచుకోవాల్సిందిగా అగ్రి, హార్టి సొసైటి ప్రతినిధులను కోరారు. ఈ ప్రదర్శనశాలలో అమృతం మామిడిపండును ఐస్ క్రీంగా వాడటం, కుంకుడుకాయతో అన్ని రకాల ఉత్పత్తులు చేయడం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ విధానం ప్రదర్శించడం జరిగింది.

Similar News