కిషన్‌రెడ్డికి ఫోన్ చేశా : తలసాని

         ఇటీవల ప్రారంభించిన జేబీఎస్,ఎంజీబీఎస్ మధ్య మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఫోటో లేదని కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తలసాని తెలిపారు. మెట్రో ప్రారంభోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని ఆహ్వానించలేదనడం అవాస్తవమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అధికారులతో పాటు ప్రారంభానికి ముందు రోజు నేనే స్వయంగా కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రావాలని కోరినట్టు ఆయన తెలిపారు. […]

Update: 2020-02-15 09:15 GMT

ఇటీవల ప్రారంభించిన జేబీఎస్,ఎంజీబీఎస్ మధ్య మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఫోటో లేదని కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తలసాని తెలిపారు. మెట్రో ప్రారంభోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని ఆహ్వానించలేదనడం అవాస్తవమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అధికారులతో పాటు ప్రారంభానికి ముందు రోజు నేనే స్వయంగా కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రావాలని కోరినట్టు ఆయన తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ సర్వీస్‌ను తొందరగా ప్రారంభించామని తలసాని వివరించారు. ఒకవేళ ప్రోటోకాల్ పరంగా కిషన్ రెడ్డికి ఇబ్బంది కలిగి ఉన్నా… అది కావాలని చేసింది కాదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అతిగా నోరు పారేసుకుంటున్నారని తలసాని విమర్శించారు. లక్ష్మణ్ కారణంగానే తెలంగాణలో బీజేపీ మరింత పతనమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తమను అతిగా విమర్శిస్తే చూస్తే ఊరుకోమని మంత్రి తలసాని హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలని తలసాని అన్నారు.

Tags:    

Similar News