సీఎం కేసీఆర్ పై నమ్మకం లేదు : బండి సంజయ్

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి మోదీ వివరించారో లేదోనని, ఈ విషయంపై తనకు సందేహం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. దీనిపై ఆయన సీఎం కేసీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. ‘కరోనా నియంత్రణకు మీరు రూ.100 కోట్లు కేటాయించాలని ప్రధానిని కోరినట్లు తెలిసిందని, కానీ ఇప్పటి వరకు కరోనా నియంత్రణకు వినియోగించిన నిధుల వివరాలు, ఖర్చులు, కేంద్రం రాష్టానికి […]

Update: 2020-07-21 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి మోదీ వివరించారో లేదోనని, ఈ విషయంపై తనకు సందేహం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. దీనిపై ఆయన సీఎం కేసీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. ‘కరోనా నియంత్రణకు మీరు రూ.100 కోట్లు కేటాయించాలని ప్రధానిని కోరినట్లు తెలిసిందని, కానీ ఇప్పటి వరకు కరోనా నియంత్రణకు వినియోగించిన నిధుల వివరాలు, ఖర్చులు, కేంద్రం రాష్టానికి ఇచ్చిన నిధులు, సీఎం రిలీప్ ఫండ్‌కు అందిన విరాళాలను ఎలా ఖర్చు చేశారో అన్ని వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు.

రాష్ట్ర ప్రజల్లో అభద్రతా భావం నెలకొన్నదని, మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న అసౌకర్యాలపైన సిబ్బందే ఆందోళనకు దిగుతున్నారని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేసుకోలేని పరిస్థితి నెలకొందని, హైకోర్టు కూడా కరోనా కట్టడిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, అధికారుల తీరు, సర్కార్ ఆస్పత్రుల్లోని అసౌకర్యాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి వాస్తవాలు చెప్పారో, లేదోనని తనకు అనుమానం ఉందని బండి సంజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News