TS-ICET ఫలితాలు విడుదల
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఐసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం మధ్యాహ్నం ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 45,975 మంది విద్యార్థులు పోస్టు గ్రాడ్యూయేషన్ కోసం ప్రవేశ పరీక్ష రాయగా అందులో 41,506 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం ఐసెట్ పరీక్షలో 90.28 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఐసెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్లో హైదరాబాద్‌కు చెందిన శుభశ్రీ (159.5 మార్కులతో) ఫస్ట్ […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఐసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం మధ్యాహ్నం ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 45,975 మంది విద్యార్థులు పోస్టు గ్రాడ్యూయేషన్ కోసం ప్రవేశ పరీక్ష రాయగా అందులో 41,506 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం ఐసెట్ పరీక్షలో 90.28 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు.
ఐసెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్లో హైదరాబాద్‌కు చెందిన శుభశ్రీ (159.5 మార్కులతో) ఫస్ట్ ర్యాంక్, నిజామాబాద్‌కు చెందిన జి. సందీప్ -2వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన అవినాష్ సిన్హా -3వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఇదిలాఉండగా, విద్యార్థులు తమ అకాడమిక్ ఇయర్ కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో కరోనా సమయంలోనూ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించినట్లు విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.