ఆయన ఉండాల్సింది టీమ్ ఇండియాలో : వార్న్

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వికెట్ కీపర్‌గా ధోనీ ఉన్నన్ని రోజులు ఆ స్థానం గురించి ఎవరూ పెద్దగా చర్చించలేదు. కానీ గత కొన్ని నెలలుగా భారత జట్టు నాణ్యమైన వికెట్ కీపర్ గురించి వెతుకుతున్నది. ధోని ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ కాబట్టి అలాంటి టాలెంట్ ఉన్న క్రికెటర్ గురించి ఎదురు చూస్తున్నది. రిషబ్ పంత్‌ను ధోని వారసుడిగా అందరూ భావించారు. కానీ అతడికి ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక పోయాడు. కేఎల్ రాహుల్ కీపర్ […]

Update: 2020-09-27 07:17 GMT

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వికెట్ కీపర్‌గా ధోనీ ఉన్నన్ని రోజులు ఆ స్థానం గురించి ఎవరూ పెద్దగా చర్చించలేదు. కానీ గత కొన్ని నెలలుగా భారత జట్టు నాణ్యమైన వికెట్ కీపర్ గురించి వెతుకుతున్నది. ధోని ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ కాబట్టి అలాంటి టాలెంట్ ఉన్న క్రికెటర్ గురించి ఎదురు చూస్తున్నది. రిషబ్ పంత్‌ను ధోని వారసుడిగా అందరూ భావించారు. కానీ అతడికి ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక పోయాడు. కేఎల్ రాహుల్ కీపర్ బ్యాట్స్‌మాన్‌గా రాణించాడు.

కానీ, నాలుగో నెంబర్‌లో అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలంటే వికెట్ కీపింగ్ భారం పడకూడదు. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ వార్న్ తన మనసులో మాటను పంచుకున్నాడు. ‘సంజూ శాంసన్ టీం ఇండియాలో ఉండాల్సిన క్రికెటర్. అతడు ఇంకా జట్టులో భాగం కానందుకు ఆశ్చర్యంగా ఉంది. సీనియర్ బ్యాట్స్‌మెన్లకే కష్టమైన షాట్లను అతడు అలవోకగా ఆడగలడు’ అని వార్న్ అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున సంజూ ఆడుతున్నాడు. అతడు ఇలాగే రాణిస్తే ఆర్ఆర్ రెండో సారి టైటిల్ గెలవడం ఖాయమని వార్న్ ధీమా వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News