కొవిడ్ అవసరాలకు హ్యూండాయ్ మోటార్ ఇండియా రూ. 20 కోట్ల సాయం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు రూ. 20 కోట్ల కొవిడ్ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని అందించనున్నట్టు బుధవారం కంపెనీ వెల్లడించింది. కొనసాగుతున్న కరోనా సహాయ కార్యక్రమాలకు కొనసాగింపుగా, హ్యూండాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఆసుపత్రులలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు, […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు రూ. 20 కోట్ల కొవిడ్ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని అందించనున్నట్టు బుధవారం కంపెనీ వెల్లడించింది. కొనసాగుతున్న కరోనా సహాయ కార్యక్రమాలకు కొనసాగింపుగా, హ్యూండాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఆసుపత్రులలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు, తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రోగులకు సహాయం చేసేందుకు దీన్ని వినియోగించనున్నట్టు తెలిపింది.
అంతేకాకుండా, కంపెనీ ఫౌండేషన్ మెడికేర్ సదుపాయాల ఏర్పాటుకు సహాయం చేయనుంది. వివిధ ఆసుపత్రులలో సహాయక సిబ్బందిని అందించనుంది. అలాగే, రాబోయే మూడు నెలలు వాటి కార్యకలాపాల వ్యయాన్ని తీరుస్తుందని, అవసరమైతే మరింత సాయం అందించనున్నటు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘కరోనా సెకెండ్ వేవ్ వల్ల భారత్ తీవ్ర సంక్షోభానికి గురైంది. అత్యంత ప్రభావిత నగరాలు, రాష్ట్రాలకు అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము. క్లిష్ట పరిస్థితుల్లో ఉపశమనం కలిగించే ప్రయత్నాలు, వనరులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించనున్నట్టు’ హ్యూండాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్ ఎస్ కిమ్ చెప్పారు.