గాంధర్వ వివాహమన్నాడు.. పోర్న్ సైట్‌లో ఫోటో పెట్టాడు

         ప్రస్తుత కాలంలో చోటుచేసుకుంటున్న ప్రేమపెళ్లిళ్లు ఎటువైపు దారితీస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అంబర్‌పేట్‌కి చెందిన యువకుడు చేసిన నిర్వాకం అతనిని ప్రేమించిన యువతి పాలిట శాపంగా మారింది. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే…          అంబర్‌పేటకు చెందిన యువకుడు ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. అతడికి మూడేళ్ల క్రితం గౌలిగూడకు చెందిన యువతితో అనుకోకుండా పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. […]

Update: 2020-02-07 04:50 GMT

ప్రస్తుత కాలంలో చోటుచేసుకుంటున్న ప్రేమపెళ్లిళ్లు ఎటువైపు దారితీస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అంబర్‌పేట్‌కి చెందిన యువకుడు చేసిన నిర్వాకం అతనిని ప్రేమించిన యువతి పాలిట శాపంగా మారింది. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే…

అంబర్‌పేటకు చెందిన యువకుడు ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. అతడికి మూడేళ్ల క్రితం గౌలిగూడకు చెందిన యువతితో అనుకోకుండా పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. ఆపై కర్ణాటకలోని ఓ గుడికి యువతిని తీసుకువెళ్లి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి.. నిన్ను ‘గాంధర్వ వివాహం’ చేసుకున్నానంటూ చెప్పాడు. అనంతరం ఇద్దరూ కలిసి అంబర్‌పేటలో కాపురం పెట్టారు.

2018లో యువతికి తెలియకుండా, ఆమె పేరు, ఫొటో వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ ఖాతా తెరిచాడా ప్రబుద్దుడు. దీని ద్వారా లైవ్‌ సెక్స్‌ చాట్‌ అంటూ పలువురిని ఆకర్షించాడు. యువతే ఆ పోస్టు పెట్టిందని భావించి, ఆకర్షితులైనవారు ఇన్‌స్ట్రాగామ్‌లోనే సందేశాలు పంపడం మొదలు పెట్టారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న నిందితుడు సంప్రదింపులు, చాట్‌ చేయాలంటే కొంత మొత్తం డిపాజిట్‌ చేయాలంటూ తన గూగుల్‌ పే ఖాతా నంబర్‌ ఇచ్చాడు.

దీంతో చాలా మంది యువకులు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లించారు. డబ్బులు రిసీవ్ చేసుకున్న తరువాత వారితో సదరు యువతి మాదిరిగా ఛాట్ చేసేవాడు. ఆ తరువాత వారికి ముఖం చాటేసేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఫోన్ నెంబర్, ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా మార్చేసేవాడు. మళ్లీ కొత్త ఫోన్ నెంబర్, కొత్త ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మళ్లీ కొత్త మనుషులు ఇలా రెండేళ్లు దందా కొనసాగించాడు. రెండు నెలల క్రితం సదరు వ్యక్తి భార్యకు కనిపించకుండా మాయమయ్యాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన భర్త కోసం ఆ యువతి తెలిసిని అందర్నీ అడిగింది.

ఇంతలో ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌లో తన ఫొటో, పేరుతో కొన్ని ఖాతాలు ఉన్నాయని, కొన్నింటిలో అభ్యంతరకర, అశ్లీల చాటింగ్స్‌ ఉన్నట్లు తెలిసింది. దీంతో అవాక్కైన యువతి ఈ తతంగమంతా ఎవరు చేశారటూ ఆరాతీసే ప్రయత్నం చేసి షాక్ తింది. అతని నిజస్వరూపం బట్టబయలైంది. మోసపోయానని గుర్తించింది. దీంతో అతను ప్రతినెలా సెల్ ఫోన్ మార్చడం గుర్తు చేసుకుని నేరుగా సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి తనగోడు వెళ్లబోసుకుంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Tags:    

Similar News