తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి వర్షాకాలం చుక్కలు చూపించింది. భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలు నేటికీ నీటిలో తేలియాడుతున్నాయి. కాగా మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం […]

Update: 2020-10-03 20:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి వర్షాకాలం చుక్కలు చూపించింది. భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలు నేటికీ నీటిలో తేలియాడుతున్నాయి. కాగా మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ మూడింటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, అందరూ అప్రమత్తంగా ఉండటంతో పాటు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News