CM Revanth: వాళ్లలా కాదు.. మేము మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాం
తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. సోమవారం శిల్పాకళా వేదికలో ఈ మహా ఘట్టం జరిగింది. ప్రారంభం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. భూభారతి పోర్టల్(Bhu Bharathi Portal)ను 69 లక్షల రైతు కుటుంబాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో జరిగిన పోరాటాలన్నీ భూమి చుట్టూ తిరిగాయని గుర్తుచేశారు. జల్.. జంగిల్.. జమీన్ నినాదంతో కుమురంభీమ్ పోరాటం చేశారని అన్నారు. ‘ధరణి కారణంగా తహశీల్దార్‌పై దాడి జరిగింది. ధరణి కారణంగా జంట హత్యలు జరిగాయి. ధరణి రెవెన్యూ సిబ్బందిపై దొంగలు అనే ముద్ర వేసింది’ అని సీఎం రేవంత్ తెలిపారు.
అందుకే తాము చాలా పకడ్బందీగా.. ప్రజాభిప్రాయాన్ని సేకరించి చట్టాన్ని తయారుచేశామని అన్నారు. గొప్ప లక్ష్యం ప్రజలకు చేరాలంటే కొన్ని తప్పవని చెప్పారు. భూభారతిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సిబ్బందిని బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. వారిని దొంగలుగా చిత్రీకరించింది. కానీ తాము అలా కాదు.. రెవెన్యూ సిబ్బందిని మేం పూర్తిగా విశ్వసిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా దర్బార్‌లతో ప్రజాసమస్యలు తెలుసుకోవాలని సూచించారు. భూదార్‌తో భూమి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.