4 గంటలే టైమ్.. హైదరాబాద్ భారీగా ట్రాఫిక్ జామ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నివస్తున్న వారు భారీగా సొంతూళ్లకు పయణమవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి జిల్లాల్లోకి వెళ్లేందుకు జనాలు భారీగా తరలారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం ఆరు గంటల నుంచే నగరంలోని […]

Update: 2021-05-12 22:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నివస్తున్న వారు భారీగా సొంతూళ్లకు పయణమవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి జిల్లాల్లోకి వెళ్లేందుకు జనాలు భారీగా తరలారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం ఆరు గంటల నుంచే నగరంలోని బస్టాప్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సుల కోసం రోడ్లపై జనాలు పడిగాపులు కాస్తు్న్నారు. బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా, పది తర్వాత కూడా బస్సులు దొరక్క మిగిలిపోయిన వారిని వెనక్కిపంపించేస్తున్నారు.

Tags:    

Similar News