హైదరాబాద్, మోహన్ బగాన్ మ్యాచ్ డ్రా

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి గోవాలోని ఫటోర్డా స్టేడియంలో హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. టాస్ గెలిచి మోహన్ బగాన్ జట్టు బంతిని కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచన హైదరాబాద్ ఈ సీజన్‌లో ఉత్సాహంగా ఆడుతున్నది. అదే ఊపును కొనసాగిస్తూ మోహన్ బగాన్ జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. బంతి ఎక్కువ […]

Update: 2020-12-11 11:46 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి గోవాలోని ఫటోర్డా స్టేడియంలో హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. టాస్ గెలిచి మోహన్ బగాన్ జట్టు బంతిని కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచన హైదరాబాద్ ఈ సీజన్‌లో ఉత్సాహంగా ఆడుతున్నది. అదే ఊపును కొనసాగిస్తూ మోహన్ బగాన్ జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. బంతి ఎక్కువ సమయం హైదరాబాద్ నియంత్రణలోనే ఉన్నది. పలుమార్లు హైదరాబాద్ జట్టుకు గోల్స్ చేసే అవకాశాలు వచ్చినా… ఫినిష్ చేయడంలో విఫలమయ్యింది.

ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా తొలి అర్దభాగంగా ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. రెండో అర్దభాగంగా దూకుడు పెంచిన మోహన్ బగాన్ 54వ నిమిషంలో గోల్ చేసింది. మిడ్ ఫీల్డ్ నుంచి అందిన పాస్‌ను మన్వీన్ సింగ్ గోల్‌గా మల్చడంతో మోహన్ బగాన్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే 65వ నిమిషంలో హైదరాబాద్‌కు గోల్ పెనాల్టీ లభించింది. జోవా విక్టర్ పెనాల్టీని గోల్‌గా మలచడంతో స్కోర్లు 1-1గా సమం అయ్యాయి. ఆ తర్వాత ఇరు జట్లకు కొన్ని అవకాశాలు వచ్చినా గోల్ చేయలేకపోయాయి. బంతి అత్యధిక సమయం హైదరాబాద్ నియంత్రణలోనే ఉన్నా.. సరైన సమయంలో పాస్‌లు ఇవ్వడంతో విఫలమైంది. నిర్ణీత సమయానికి స్కోర్ 1-1గా ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. హైదరాబాద్ ఎఫ్‌సీకి వరుసగా ఇది మూడో డ్రా కావడం గమనార్హం. సౌవిక్ చక్రబర్తికి డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, లిస్టన్ కొలాకోకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Tags:    

Similar News