'తోప్' వెంకట్ అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: ‘తోప్’ టీవీ యాప్ సీఈవో సతీష్ వెంకటేశ్వర్ల(28)ను మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. తమ కంటెంట్‌ను పైరసీ చేశారంటూ వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆయనపై మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌కు చేరుకుని వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ముంబై కోర్టు ఆయనకు 7 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఇంజినీర్ సతీష్ వెంకటేశ్వర్లు తోప్ టీవీ యాప్‌, వెబ్ సైట్‌ను […]

Update: 2021-07-14 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘తోప్’ టీవీ యాప్ సీఈవో సతీష్ వెంకటేశ్వర్ల(28)ను మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. తమ కంటెంట్‌ను పైరసీ చేశారంటూ వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆయనపై మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌కు చేరుకుని వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ముంబై కోర్టు ఆయనకు 7 రోజుల రిమాండ్ విధించింది.

హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఇంజినీర్ సతీష్ వెంకటేశ్వర్లు తోప్ టీవీ యాప్‌, వెబ్ సైట్‌ను నడుపుతున్నారు. ఇది పూర్తిగా పైరసీ యాప్. అమెజాన్ ఫ్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5 లాంటి యాప్‌లలో విడుదలయ్యే సినిమాలను కాపీ చేసి ఈ యాప్‌లో అప్ లోడ్ చేస్తారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా లాంటి యాప్‌లలో సబ్‌స్క్రీప్షన్ తీసుకోవాలంటే.. చాలా ఖర్చు అవుతుంది. దీంతో ఆ యాప్స్‌లలోని కంటెంట్‌ను ఫ్రీగా అందించే తోప్ టీవీ యాప్‌ను చాలామంది యువత వాడుతున్నారు. సంవత్సరానికి రూ.35తో ప్రీమియం సబ్‌స్క్రీప్షన్ తీసుకుంటే మధ్యలో యాడ్స్ రాకుండా సినిమాలు చూడవచ్చు.

గత రెండు సంవత్సరాల నుంచి తోప్ టీవీ యాప్‌తో పాటు వెబ్ సైట్‌ను సతీష్ వెంకటేశ్వర్లు నడుపుతున్నాడు. దీనికి లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇక 5 వేల మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడంతో తోప్ టీవీ ఆగిపోయే అవకాశముంది.

Tags:    

Similar News