హైదరాబాద్ లో చైనా కొత్త స్కాం..

దిశ, వెబ్ డెస్క్ : చైనా లోన్ యాప్ స్కాం లో కొత్త కోణం బయటపడింది. లోన్ యాప్ ల వల్ల చాలా మంది నుంచి అధికంగా సొమ్ము వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు ఇలాంటివి చట్టవిరుద్దం కూడా. అయితే ఇంత కాలం చైనా తన ఉత్పత్తులను అమ్ముకోవడమే కాకుండా కొత్త మోసాలకు కూడా తెరలేపింది. చైనా లోన్ యాప్ పై ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ సైబర్‌ స్టేషన్‌(సీసీఎస్‌)పోలీసులు యాప్ ప్రతినిధులపై కేసును […]

Update: 2021-09-28 07:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : చైనా లోన్ యాప్ స్కాం లో కొత్త కోణం బయటపడింది. లోన్ యాప్ ల వల్ల చాలా మంది నుంచి అధికంగా సొమ్ము వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు ఇలాంటివి చట్టవిరుద్దం కూడా. అయితే ఇంత కాలం చైనా తన ఉత్పత్తులను అమ్ముకోవడమే కాకుండా కొత్త మోసాలకు కూడా తెరలేపింది. చైనా లోన్ యాప్ పై ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ సైబర్‌ స్టేషన్‌(సీసీఎస్‌)పోలీసులు యాప్ ప్రతినిధులపై కేసును నమోదు చేశారు. లోన్‌ యాప్స్‌ పేరుతో కొత్త పద్ధతిలో కొంతమంది గ్యాంగ్‌లు గా ఏర్పడి సుమారు రూ. 5 వేల కోట్లని అక్రమమార్గంలో చైనాకు తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) అధికారులు గుర్తించారు.

విమానాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నాట్టు నకిలీ బిల్లులను సృష్టించారని అధికారులు తెలిపారు. బిల్లుల విషయమై విచారణ జరపగా అసలు విషయం బయటపడిందని వెల్లడించారు. ఇప్పటి వరకూ సుమారు 450 కోట్ల విలువైన వస్తువులను తెచ్చుకున్నట్టు పత్రాలు సృష్టించారు. విచారణ నిమిత్తం లోన్ యాప్ ప్రతినిధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News