చుట్టాలమంటూ దొరికినంత దోచుకెళ్తారు
దిశ వెబ్‌డెస్క్:శుభకార్యాలు అందరికీ జీవితకాలం గుర్తుండుపోయే తీపి గుర్తులు. ఇంట్లోని ప్రతి శుభకార్యాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ఏ శుభకార్యం అయినా సరే నెల నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. బంధువులు, స్నేహితులందరినీ పిలిచి వారి సమక్షంలో ఘనంగా జరుపుకుంటారు. ఇక శుభకార్యాల్లో బంధుమిత్రుల సందడితో హడావిడిగా ఉంటుంది. దీనినే అదునుగా చేసుకున్నారు కొంతమంది కిలాడీ లేడీలు. తెలియని వారి శుభకార్యాలకు హాజరై చుట్టాలమని చెప్పుకుంటూ అందినంత దొచేసుకుంటున్నారు. బంధువులు హడావుడిగా ఉన్న సమయంలో […]
దిశ వెబ్‌డెస్క్:శుభకార్యాలు అందరికీ జీవితకాలం గుర్తుండుపోయే తీపి గుర్తులు. ఇంట్లోని ప్రతి శుభకార్యాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ఏ శుభకార్యం అయినా సరే నెల నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. బంధువులు, స్నేహితులందరినీ పిలిచి వారి సమక్షంలో ఘనంగా జరుపుకుంటారు. ఇక శుభకార్యాల్లో బంధుమిత్రుల సందడితో హడావిడిగా ఉంటుంది.
దీనినే అదునుగా చేసుకున్నారు కొంతమంది కిలాడీ లేడీలు. తెలియని వారి శుభకార్యాలకు హాజరై చుట్టాలమని చెప్పుకుంటూ అందినంత దొచేసుకుంటున్నారు. బంధువులు హడావుడిగా ఉన్న సమయంలో ఖరీదైన గిఫ్టులను కొట్టేస్తున్నారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు లేడీ కిలాడి లేడీలతో పాటు మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యులను శంషాబాద్ జోన్ ఎస్ఓటి పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఈ గ్యాంగ్ నుంచి 50 వేల విలువైన కానుకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాలలో జరిగే వివాహ వేడుకలకు హాజరై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీళ్లు మధ్యప్రదేశ్‌లోని రాజ్ గాడ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ఎనిమిది సంవత్సరాల బాలిక ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.