దేశంలోనే హైదరాబాద్ నెం.1
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉండగా, తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. సీసీటీవీ కెమెరాల వినియోగంలో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలతో భద్రతాపరంగా పటిష్ఠంగా ఉన్న నగరాలపై ఇంగ్లండ్‌కు చెందిన కంపారిటెక్ కంపెనీ పరిశోధకులు సర్వే చేశారు. ఈ సర్వేలో హైదరాబాద్ మహా నగరం 3.5 లక్షల సీసీటీవీ కెమెరాలతో ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో నిలవగా, దేశంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది. గత […]
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉండగా, తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. సీసీటీవీ కెమెరాల వినియోగంలో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలతో భద్రతాపరంగా పటిష్ఠంగా ఉన్న నగరాలపై ఇంగ్లండ్‌కు చెందిన కంపారిటెక్ కంపెనీ పరిశోధకులు సర్వే చేశారు.
ఈ సర్వేలో హైదరాబాద్ మహా నగరం 3.5 లక్షల సీసీటీవీ కెమెరాలతో ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో నిలవగా, దేశంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది. గత కొన్నేళ్లుగా నగర ప్రజల్లో వచ్చిన చైతన్యం, ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా అమర్చిన కెమెరాలు ఎంతో ఫలితాలనిస్తున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు.సీసీటీవీ కెమెరాలతో నేరస్తులను పట్టుకోవడమే కాకుండా నేరాలు తగ్గడానికీ అవకాశం ఏర్పడిందని ఆయన తెలిపారు.