బిగ్ బ్రేకింగ్: ఉప ఎన్నిక వేళ.. కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమీపిస్తుండడంతో పాలనాపరంగా ప్రభుత్వం పలు మార్పులు చేస్తున్నది. ఇప్పటికే కింది స్థాయి సిబ్బందిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ శశాంకను ట్రాన్స్‌ఫర్ చేసింది. జీఏడీ(సాధారణ పరిపాలన శాఖ)కు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను నియమించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న […]

Update: 2021-07-19 12:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమీపిస్తుండడంతో పాలనాపరంగా ప్రభుత్వం పలు మార్పులు చేస్తున్నది. ఇప్పటికే కింది స్థాయి సిబ్బందిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ శశాంకను ట్రాన్స్‌ఫర్ చేసింది. జీఏడీ(సాధారణ పరిపాలన శాఖ)కు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను నియమించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న వీపీ గౌతమ్‌ను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న అభిలాష అభినవ్‌ను తదుపరి పూర్తి స్థాయి కలెక్టర్ వచ్చేంత వరకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం బదిలీలకు తెర తీయడం గమనార్హం. ఒకవైపు గుట్టుచప్పుడు కాకుండా ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్నది. మరోవైపు కొత్త రేషను కార్డులను జారీ చేస్తున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను చకచకా విడుదల చేస్తున్నది. ఇప్పుడు జిల్లా కలెక్టర్‌ను మార్చేసింది. ఇకపైన పలు స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది బదిలీలు జరగనున్నాయి. ఎలాగూ దళిత బంధు పథకం అమలు కోసం సమర్ధులైన అధికారులను నియమించనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కలెక్టర్‌ను బదిలీ చేయడం విశేషం.

రూ. 55 పొదుపుతో నెలకు 3000 పింఛన్.Pradhan Mantri Shram Yogi Maandhan (PM-SYM)

Tags:    

Similar News