హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? నేడే ప్రకటన?
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీకి దింపేందుకు అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ రిటన్ లెటర్ పంపింది. ఇప్పటికే దామోదర రాజనర్సింహ బృందం నలుగురు అభ్యర్థుల పేర్లను సూచిస్తూ ఏఐసీసీకి నివేదించారు. టీపీసీసీ సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలంటూ ఏఐసీసీ సమాచారం పంపించారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సీఎల్పీలో సమావేశమయ్యారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీకి దింపేందుకు అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ రిటన్ లెటర్ పంపింది. ఇప్పటికే దామోదర రాజనర్సింహ బృందం నలుగురు అభ్యర్థుల పేర్లను సూచిస్తూ ఏఐసీసీకి నివేదించారు. టీపీసీసీ సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలంటూ ఏఐసీసీ సమాచారం పంపించారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సీఎల్పీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపికపై రాత్రి వరకు చర్చించారు.
నేడు ప్రకటన
హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థుల పేర్లను పరిశీలనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం నుంచి అక్కడ ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. బుధవారం రాత్రి వరకు దీనిపై చర్చించారు. దీనిలో భాగంగా గురువారం భూపాలపల్లి సభ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అభ్యర్థిని ప్రకటించనున్నారు.