బిగ్ బ్రేకింగ్.. హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 8 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా, అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది.
అక్టోబర్ 8 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా, అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది.
ఈసారి కూడా కేసీఆర్ ఢిల్లీ లో ఉండగానే హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారయింది. గతంలో ఆయన ఢిల్లీలో ఉండగా ఎన్నికల సంఘం బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు షెడ్యూలు ప్రకటించిన విషయం, హుజూరాబాద్‌ను వదిలేసిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా.. ఉప ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. Click Here