దూకుడు పెంచిన బీజేపీ.. హుజూరాబాద్‌లో ఇన్‌చార్జీల నియామకం

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం హుజూరాబాద్‌లో రాజకీయం పరిణామం రసవత్తరంగా మారింది. ఎలాగైనా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, టీఆర్ఎస్‌కు దుబ్బాక లాంటి మరో ఓటమి చవిచూపించాలని బీజేపీ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం మండలాలకు ఇంచార్జ్‌లను ప్రకటించింది. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కో ఇన్చార్జ్‌లుగా మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను నియమించింది. హుజూరాబాద్ టౌన్ ఇన్‌చార్జిగా […]

Update: 2021-06-23 23:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం హుజూరాబాద్‌లో రాజకీయం పరిణామం రసవత్తరంగా మారింది. ఎలాగైనా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, టీఆర్ఎస్‌కు దుబ్బాక లాంటి మరో ఓటమి చవిచూపించాలని బీజేపీ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం మండలాలకు ఇంచార్జ్‌లను ప్రకటించింది. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కో ఇన్చార్జ్‌లుగా మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను నియమించింది.

హుజూరాబాద్ టౌన్ ఇన్‌చార్జిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, రూరల్ ఇన్‌చార్జిగా కీలక నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిలను నియమించింది. జమ్మికుంట ఇన్‌చార్జిగా ఎంపీ ధర్మపురి అర్వింద్, జమ్మికుంట రూరల్ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వీణవంక మండల ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంట మండల ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి, కమలాపూర్ మండల ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, కోఆర్డీనేటర్‌గా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా.. హుజూరాబాద్‌లో ఈ ఉదయం 11 గంటలకు బీజేపీ ఇన్‌చార్జిలు, ముఖ్యనేతలు సమావేశం కానున్నారు.

Tags:    

Similar News