ఆయనకు విశ్వవ్యాప్తంగా మంచి పేరుంది..

దిశ ప్రతినిధి, మెదక్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల రాష్ట్ర కమిటీ సభ్యునిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పీవీ శత జయంతి వేడుకల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్యసభ సభ్యులు కేశవ రావు, సతీష్ కుమార్‌ను రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమిస్తున్నట్టు గురువారం ప్రకటించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పీవీకి […]

Update: 2020-08-13 06:01 GMT

దిశ ప్రతినిధి, మెదక్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల రాష్ట్ర కమిటీ సభ్యునిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పీవీ శత జయంతి వేడుకల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్యసభ సభ్యులు కేశవ రావు, సతీష్ కుమార్‌ను రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమిస్తున్నట్టు గురువారం ప్రకటించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో పీవీకి ఎంతో సన్నిహితంగా ఉన్న వొడితల కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ కుమార్‌ను కమిటీలో సభ్యునిగా నియమించారు. దీంతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ సీఎం కేసీఆర్, కె.కేశవరావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పీవీ స్వగ్రామం అయిన వంగర హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లిలో ఉండటం తమకు గర్వకారణమన్నారు.

తెలిపారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ ఎన్నో పదవులను అలంకరించి, ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చారన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని పేర్కొన్నారు. పీవీ శతజయంతి వేడుకల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ఏడాది పొడుగునా కార్యక్రమాలు జరుగుతాయని, విద్యావంతులు, మేధావులు, పీవీ అభిమానులు అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News